హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ సరఫరాలేదని హైవేపై ధర్నా

ప్రకాశం: సంతమాగులూరు (మం) కొమ్మలపాడు గ్రామం వద్ద వ్యవసాయానికి విద్యుత్ సక్రమంగా ఇవ్వడం లేదంటూ సబ్ స్టేషన్ ఎదురు నామ్ హైవేపై రైతులు ధర్నా చేశారు. తరచుగా లో వోల్టేజ్ రావడంతో మోటర్లు రిపేర్ వస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై, సీఐలు రైతులతో మాట్లాడి ధర్నా విరమింప చేశారు.