కృష్ణా: గుడివాడ బేతవోలు శాంతి వృద్ధాశ్రమంలో ఈశ్వరమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో బుధవారం వృద్ధులకు చీరలను పంపిణీ చేశారు. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ మాట్లాడుతూ.. ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులు ప్రతినెలా ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తామని చెప్పడం ఎంతో సంతోషకరమని తెలిపారు. కార్యక్రమంలో తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వృద్ధులకు చీరలు పంపిణీ


