హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మిస్డ్ కాల్‌తోనే బ్యాంకు ఖాతాలో నగదు మాయం

ప్రకాశం: వెలిగండ్ల (మం) కోటాలపల్లి గ్రామానికి చెందిన కార్తీక్‌కు బుధవారం వచ్చిన ఫోన్ కాల్ సైబర్ మోసానికి దారితీసింది. హిందీలో మాట్లాడిన గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేయగా, కాల్‌ అటెండ్‌ చేసిన కొద్దిసేపటికే ఆయన ఖాతాలోని మొత్తం రూ.4,150 నగదు కట్‌ అయినట్లు బాధితుడు తెలిపాడు. సైబర్ నేరగాళ్ల మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.