హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీతారామాలయ నిర్మాణానికి భూమి పూజ

KDP: ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం గ్రామంలో బుధవారం సీతారామాలయానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి భూమి పూజ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ. 40 లక్షల వ్యయంతో సీతారామాలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.