హైదరాబాద్: 28°C
వార్తలు

‘చైనాతో భారత్‌కు ఆర్థిక సమస్యలున్నాయి’

చైనాతో భారత్‌కు ప్రధాన ఆర్థిక సమస్యలు ఉన్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. చాలా రంగాల్లో భారత్‌కు చైనాలో మార్కెట్ యాక్సెస్ లభించడం లేదని తెలిపారు. చైనాలో మనకు సమాన అవకాశాలు దక్కడం లేదని స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో దేశీయ కంపెనీలను తక్కువ వాల్యుయేషన్‌తో విదేశీ సంస్థలు దక్కించుకోకుండా జాగ్రత్తపడ్డామని, ఇప్పుడు పెట్టుబడులపై ప్రపంచం ఆలోచన మారిందన్నారు.