హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టుకు ఓవైసీ

TG: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను సవాల్‌ చేస్తూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. ఓవైసీ పిటిషన్‌పై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.