హైదరాబాద్: 28°C
వార్తలు

భారీగా పెరిగిన టోకు ద్రవ్యోల్బణం

ఇంధనం, ఆహార పదార్థాల ధరలు పెరగడంతో SEP నెలలో టోకు ధరల సూచీ(WPI) ఆధారిత ద్రవ్యోల్బణం 11.39 శాతానికి పెరిగింది. ఆగస్టులో ఇది 9.92 శాతంగా ఉండగా, అమాంతం పెరిగినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల్లో వెల్లడించింది. మరోవైపు SEPలో రిటైల్ ద్రవ్యోల్బణం సైతం 4.83 శాతం నుంచి 5.54 శాతానికి పెరిగింది. గత ఆరు నెలల్లో WPI ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి.