MBNR: జడ్చర్ల మండలం ఖానాపూర్లో భూ రీసర్వే పనులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) హరిప్రియ పరిశీలించారు. రెండు బృందాలతో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రోవర్ సాంకేతికతతో భూముల కొలతలు,సరిహద్దులను కచ్చితంగా నిర్ధారిస్తామన్నారు. సర్వే పూర్తయ్యాక భూ యజమానులకు ఎల్పీఎం మ్యాపులు అందజేస్తామని తెలిపారు. భూ వివాదాల నివారణకు రైతులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
ఖానాపూర్ లో భూ రీసర్వే పరిశీలన


