హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

GDWL: గద్వాల జిల్లా కేంద్రంలోని ఎర్రమటి వీధిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో ఇవాళ స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో పేదల సొంత ఇంటి కల నెరవేరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.