హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాయత్రి దేవిగా బల్కంపేట ఎల్లమ్మ దర్శనం

HYD: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బల్కంపేట ఎల్లమ్మను 4వ రోజు గాయత్రి దేవిగా అలంకరించారు. వివిధ రకాల పూలు, గాజులు, పట్టు చీరలతో అమ్మవారి అలంకరణ కనులవిందుగా ఉంది. వేకువ జాము నుంచి పవిత్ర గంగాజలాలు, పంచామృతాలతో అభిషేకించి సుందరంగా గర్భగుడిని అలంకరించి అమ్మకు నైవేద్యం సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.