గద్వాల నియోజకవర్గం మల్దకల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి దేవరగట్టు వరకు రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన, బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు రాకపోకలు సులభతరం చేసేందుకే ఈ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు, పాల్గొన్నారు.
తెలంగాణ
రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే


