హైదరాబాద్: 28°C
తెలంగాణ

విషాదం.. 14 నెలల చిన్నారి మృతి

ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో విషాదం నెలకొంది. జ్వరంతో బాధపడుతున్న 14 నెలల చిన్నారిని తల్లిదండ్రులు రెండు రోజుల క్రితం ఖమ్మంలోని అంకుర ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం పాప మృతి చెందింది. ఫిట్స్‌తో పాటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు వైద్యులు గుర్తించారని సమాచారం. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.