SRCL: ఇల్లంతకుంట మండలంలో ఈ నెల 15, 16 తేదీల్లో కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ రాచకట్ల సురేష్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, అర్హులైన వారు ఫారం-6 నింపి సమర్పించి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఇల్లంతకుంటలో కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక క్యాంపులు


