హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్లారెడ్డిపేటలో ధాన్యం కొనుగోళ్లు జోరు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలో వరి కోతలతో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. సన్న బియ్యం క్వింటా రూ.8 వేలకు చేరడంతో సన్న పచ్చి ధాన్యానికి గిరాకీ పెరిగింది. వ్యాపారులు సన్నాలను క్వింటా రూ.3,400-3,500కు, దళారులు దొడ్డు రకాన్ని పొలాల్లోనే రూ.2,400కు కొంటున్నారు. కల్లాల వద్ద రూ.3,100 మాత్రమే ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. లైసెన్సు లేని వ్యాపారులపై అధికారులు నిఘా పెట్టాలని కోరుతున్నారు.