ASF: జిల్లాలో ఎల్నినో వాతావరణ పరిస్థితులతో విద్యుత్ డిమాండ్ పెరిగిందని SE ఉత్తమ్ జాడె బుధవారం ప్రకటనలో తెలిపారు. లోటు వర్షపాతం,ఎండల తీవ్రతతో AC,కూలర్ల వాడకంతో రోజు వారీ విద్యుత్ వినియోగం సాధారణ స్థాయిని మించిపోయిందని పేర్కొన్నారు.భూగర్భ జలాలు తగ్గడం, పంటలను కాపాడుకునేందుకు రైతులు మోటార్లు నడపడంతో విద్యుత్ వ్యవస్థపై అదనపు భారం మోపుతుందన్నారు.
తెలంగాణ
ఎల్నినో ప్రభావంతో అధిక విద్యుత్ వినియోగం


