హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు శ్రీవారాహి అమ్మవారి హోమం

ATP: నగరంలోని శివకోటి మహాలక్ష్మి శ్రీపీఠంలో నేడు శ్రీవారాహి అమ్మవారి హోమం వైభవంగా జరుపనున్నట్లు పీఠం వ్యవస్థాపకుడు అప్పాస్వామి, కార్యదర్శి అమర్ తెలిపారు. బుధవారం ఉదయం మహాగణపతిపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యమేళన అనంతరం చండీ నవావరణ పూజ, నవ చండీ పారాయణాలు, రుద్రాభిషేకం జరుగుతుందన్నారు. సాయంత్రం 6 గంటలకు దుర్గా నవవరణ, శ్రీసూక్త పూజలతో పాటు హోమం జరుగుతుందన్నారు.