హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

NRPT: ధన్వాడ మండలం మందిపల్లి తండా, పసుపుల సర్పంచ్‌లు నిల్యా నాయక్‌, నర్మద రవికుమార్‌ గౌడ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌లు మహేష్‌, సంతోష్‌, నిర్వాహకులు పాల్గొన్నారు.