హైదరాబాద్: 28°C
వార్తలు

‘స్వతంత్ర భారత్‌లో ఉద్యమాలు తప్పా?’

నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. నిరసన రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. బ్రిటిష్ కాలంలోనే ఎన్నో ఉద్యమాలు జరిగాయని, స్వాతంత్య్ర భారత్‌లో ఉద్యమాలు చేయడం తప్పా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరిరక్షణ కోసమే తాము ఈ ఉద్యమం చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.