హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భూముల వేలానికి భారీ స్పందన

VSP: విశాఖ స్టీల్‌ ప్లాంట్ భూముల ఈ-వేలంలో తొలిరోజు రూ.366.33 కోట్ల విలువైన బిడ్లు దాఖలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. మొత్తం 150 ప్లాట్లను ఎన్‌ఎల్‌ఎంసీ పారదర్శకంగా విక్రయించింది. రిజర్వ్ ధర కంటే 17.23 శాతం అధికంగా ధర పలకగా, గరిష్టంగా గజానికి రూ.1.80 లక్షలకు పైగా లభించింది. వినియోగంలో లేని మిగులు భూములను వేలం వేసినట్లు వెల్లడించింది.