హైదరాబాద్: 28°C
తెలంగాణ

108లో మహిళ ప్రసవం.. చివరికి.!

NZB: ధర్పల్లి మండలం సీతాయిపేట్కు చెందిన భారతికి పురిటి నొప్పులు రావడంతో మంగళవారం రాత్రి 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు తీవ్రంగా కావడంతో సిబ్బంది ఈ ఎంటీ సుందర్, పైలట్ శ్రవణ్ సుఖ ప్రసవం చేశారు. దీంతో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.