హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రేమ పేరుతో మోసం.. కలెక్టర్‌కు ఫిర్యాదు

KKD: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని సామర్లకోటకు చెందిన యువతి కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. రాగంపేటలోని రొయ్యల కంపెనీలో పనిచేస్తున్న సమయంలో మాధవపట్నానికి చెందిన కోశెట్టి నానితో పరిచయం ఏర్పడిందన్నారు. ఇద్దరూ పెళ్లికి సిద్ధమైనా కుటుంబ సభ్యుల జోక్యంతో అతను వెనక్కి తగ్గాడని తెలిపారు. న్యాయం చేయాలని కోరారు.