TG: జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 5,300 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 1,183 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 317.32 మీటర్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది.
వార్తలు
జూరాలకు స్వల్పంగా వరద


