హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సమస్యలుంటే ఈ నెంబర్‌కు కాల్ చేయండి..!

KMM: ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు లేకపోయినా వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా ఉదయం నుంచి 10 గంటల పాటు నిరంతర విద్యుత్ ఇస్తున్నామని ఖమ్మం సర్కిల్ ఎస్‌ఈ శ్రీనివాసాచారి తెలిపారు. అవసరమైన చోట్ల ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచామని, కరెంట్ సమస్యలు ఉంటే రైతులు వెంటనే 8712424884 నెంబర్‌కు గానీ, స్థానిక అధికారులకు గానీ ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.