హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ పౌరులుగా ఎదగాలి: ఎస్పీ

PLD:​ నరసరావుపేట శ్రీ కృష్ణవేణి డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలకు పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్ మంగళవారం రాత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చట్టాలపై అవగాహనతో ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.