GNTR: తెనాలి ఆర్ఆర్ కాలనీలో మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు బుధవారం ఉదయం పర్యటించారు. పారిశుధ్య కార్మికులతో మాట్లాడి, పనుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఇంటింటికీ చెత్త సేకరణ కోసం వినియోగిస్తున్న ఈ-ఆటోలను పరిశీలించారు. కాలనీలో పారిశుధ్య పనులు సమర్థవంతంగా నిర్వహించాలని, చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహించరాదని సిబ్బందికి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో మున్సిపల్ కమిషనర్ తనిఖీలు


