హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో కార్డాన్ సెర్చ్‌.. వాహనాలు స్వాధీనం

GNTR: తెనాలి భాస్కరరావుపేట ఏరియాలో బుధవారం ఉదయం పోలీసులు కార్డాన్ సెర్చ్‌ నిర్వహించారు. డీఎస్పీ జనార్ధనరావు నేతృత్వంలో సీఐలు రవీంద్రబాబు, నాయబ్ రసూల్, ఎస్‌ఐలతో పాటు సుమారు 75 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో అనుమానితులను విచారించి, నేర చరిత్ర ఉన్నవారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. సరైన పత్రాలు లేని 45 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.