హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహా చండీ దేవి అలంకరణలో శ్రీదేవి అమ్మవారు

కోనసీమ: అమలాపురం పట్టణం శ్రీదేవి మార్కెట్‌లో వేంచేసి ఉన్న శ్రీదేవి అమ్మవారు బుధవారం మహా చండీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.