శ్రీసిటీలో(AP) తయారైన డ్రైవర్ రహిత రైళ్లు చెన్నై మెట్రో ఫేజ్-2 రూట్లో గరిష్ఠంగా గంటకు 80 కి.మీ వేగంతో దూసుకెళ్తాయి. ఒక్కో రైలులో 3 కోచ్లు ఉండగా, 1,000 మంది ఒకేసారి ప్రయాణించవచ్చు. ప్రస్తుతం మరో 32 డ్రైవర్ రహిత రైళ్ల ఉత్పత్తి కొనసాగుతోందని 'ఆల్స్టోమ్ ఇండియా' సంస్థ ఎండీ తెలిపారు. ఈ ప్రాజెక్టు భారతీయ ఇంజినీరింగ్ సత్తాను చాటిచెబుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
వార్తలు
గంటకు 80 కి.మీ వేగంతో డ్రైవర్లెస్ రైళ్లు!


