హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి'

WGL: కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్ హామీలను వెంటనే అమలు చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి డిమాండ్ చేశారు. వరంగల్ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమకారులు చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తే ప్రభుత్వంపై ఉద్యమం చేపడతామని రవి హెచ్చరించారు.