హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ మేయర్ పీఠం ఆయనకేనా?

NTR: విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. వంగవీటి రాధా బుధవారం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. ఇటీవలే CM చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను ఆయన కలిశారు. కొంతకాలంగా విజయవాడ మేయర్ పదవికి వంగవీటి రాధాకృష్ణతో పాటు ఆయన భార్య పుష్పవల్లి పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా రాధా జనసేనలో చేరుతుండటంతో విజయవాడ మేయర్ సీటు వంగవీటికే అని టాక్ ఉంది.