హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు పనులు..!

అన్నమయ్య: తంబళ్లపల్లె నుంచి కోసువారిపల్లె (పాపనచెరువు పల్లె) క్రాస్ వరకు రూ.735 లక్షల PMGSY నిధులతో తారు, సీసీ రోడ్డు నిర్మించారు. సుమారు 8KM ఉన్న ఈ రోడ్డులో నీటి ప్రవాహాలున్న చోట 4 కల్వర్టులు నిర్మించాల్సి ఉంది. అయితే దేవరబురుజు సమీపంలోని వాగు వద్ద కల్వర్టు నిర్మించకుండా వదిలేశారు. దీంతో ఆ మార్గంలో వెళ్లే ప్రజలు, రైతులు, వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.