SRCL: పట్టణం వెంకంపేటలో మహిళల కోసం నిర్మించిన కమ్యూనిటీ భవనం నిర్లక్ష్యంతో దుస్థితికి చేరుకుంది. 2019లో పురపాలక అధికారులు రూ.25 లక్షలతో నిర్మించిన ఈ భవనాన్ని మహిళల సమావేశాలు, సామాజిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు. నిర్వహణ లేక తలుపులు, కిటికీలు ధ్వంసమవడంతో పాటు పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. భవనం మందుబాబులకు అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు.
తెలంగాణ
మందుబాబులకు అడ్డాగా మారిన మహిళా కమ్యూనిటీ భవనం


