హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేయాలి'

PDPL: మార్చి 2027 నాటికి మంథనిలో సమీకృత డివిజన్ కార్యాలయాల భవన సముదాయం నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. మంగళవారం భవన సముదాయ నిర్మాణం, నూతన ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించారు. మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించాలన్నారు. అధికారులు పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.