MLG: ఏటూరునాగారం మండలం శివాపురంలో ఓ బోరుబావి ప్రత్యేకత అందరినీ ఆకట్టుకుంటోంది. రైతు రంగారెడ్డి పొలంలోని బోరుబావి నుంచి మోటార్, కరెంట్ వినియోగం లేకుండానే గత 12 ఏళ్లుగా నీరు ఉబికి వస్తోంది. ఈ నీటితో 20 ఎకరాలతో పాటు పక్క రైతుల మరో 10 ఎకరాలు కలిపి మొత్తం 30 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వింతకు గల కారణాలను తెలుసుకునేందుకు నిపుణులు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ
కరువు భయమే లేదు.. ఆ బావికి


