హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో రాగల ఐదు రోజులు వర్షాలు

అల్లూరి జిల్లాలో రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆదిలక్ష్మి తెలిపారు. ఈనెల 18వ తేదీ వరకు చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్ల పరిధిలో కనిష్ఠంగా 0.5 నుంచి గరిష్ఠంగా 16.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందన్నారు. గాలిలో తేమ 83 నుంచి 85 శాతం ఉంటుందన్నారు.