BHNG: వలిగొండ మండలం పల్లెర్ల స్టేజీ సమీపంలో ద్విచక్రవాహనం గేదెను ఢీకొన్న ప్రమాదంలో ధరావత్ చందర్ (42) మృతిచెందాడు. జాటోత్ తండాకు చెందిన చందర్ తన సోదరుడు చందుతో కలిసి ఆయిల్పామ్ తోటలో పనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చందుకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ
గేదెను ఢీకొని వ్యక్తి మృతి


