హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘణంగా బతుకమ్మ సంబరాలు

KNR: గంగాధర మండలం నాగిరెడ్డీపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం గ్రామసభ ముగిసిన అనంతరం మహిళలు, యువతులు, చిన్నారులు, పెద్దలు పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. ఇలాంటి వేడుకలతో గ్రామ ప్రజలంతా ఒకచోట చేరి ఆత్మీయంగా గడపడం సంతోషంగా ఉందని తెలిపారు.