హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

త్రిశూల్ లక్ష్యాలపై పల్లె నిద్రలో అవగాహన

VZM: మెరకముడిదాం SI లోకేష్ కుమార్ మంగళవారం రాత్రి స్దానిక బైరిపురం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రిశూల్‌ లక్ష్యాలు, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రగ్స్‌ నియంత్రణ, సైబర్‌ నేరాలపై యువతకు అవగాహన కల్పించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు గ్రామస్థులంతా సహకరించాలని కోరారు.