హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో మెగా రక్తదాన శిబిరం

SRCL: పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం ఎస్పీ మహేశ్ బి. గితేను కలిసి శిబిరం నిర్వహణపై వివరించారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించి, శిబిరాన్ని విజయవంతం చేస్తామన్నారు. యువత, ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని అన్నారు.