హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం మార్కెట్‌కు దసరా సెలవులు..!

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈ నెల 17 నుంచి 21 వరకు ఐదు రోజుల దసరా సెలవులు ప్రకటించారు. వారంతపు సెలవులతో పాటు దుర్గాష్టమి, విజయదశమి పండుగల కారణంగా మార్కెట్ మూసి ఉంటుందని కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. మళ్లీ 22వ తేదీ గురువారం నుంచి పంటల క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని, రైతులు గమనించాలని కోరారు.