హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సర్వీస్‌ రోడ్డు కోసం మరోసారి ధర్నా

KNR: మానకొండూర్‌ (M) ఈదులగట్టేపల్లి గ్రామస్థులు ఎన్‌హెచ్‌ 563పై సర్వీస్‌ రోడ్డు నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ మరోసారి నిన్న ధర్నా నిర్వహించారు. గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు ధర్నాలు చేయడంతో పాటు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టినా సర్వీస్‌ రోడ్డు పనులు ముందుకు సాగడం లేదన్నారు.