హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు శ్రీ మహాచండీ దేవిగా అమ్మవారి దర్శనం

GDWL: దేవీ నవరాత్రుల్లో భాగంగా నేడు దుర్గాభవానీ దేవి శ్రీ మహాచండీ దేవిగా అలంకారంలో దర్శనమిస్తారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా అమ్మవారు ఉద్భవించింది. శ్రీ చండీ దేవిని ప్రార్థిస్తే సర్వదేవతలను పూజించినట్లేనని భక్తుల నమ్మకం. ఈ అమ్మవారి అనుగ్రహం వలన విద్యాబుద్ధులు, కీర్తి, ఐశ్వర్యం లభిస్తుంది.