TG: రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఐదో రోజు 'అట్ల బతుకమ్మ'ను భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. నానబెట్టిన బియ్యంతో చేసిన అట్లను గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. సాయంత్రం రంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడి చేస్తూ, ఈ అట్లను ఇరుగుపొరుగు వారికి పంచుతూ ఆనందాన్ని పంచుకుంటారు.
వార్తలు
ఐదో రోజు 'అట్ల బతుకమ్మ'


