E.G: మునికూడలిని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో మోడల్ పుష్కర ఘాట్, పుష్కర విలేజ్, సీసీ రహదారులు, మ్యాజిక్ డ్రెయిన్ల పనుల పురోగతిని పరిశీలించారు. బిల్లుల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు
ఆంధ్రప్రదేశ్
'పుష్కర ఘాట్ పనులు త్వరగా పూర్తి చేయాలి'


