NLG: దేవరకొండకు చెందిన వృద్ధ దంపతులు చిలుకూరి అనంతరాములు, భాగ్యమ్మ తమ పిల్లలు పట్టించుకోవడం లేదని, మంగళవారం మండల న్యాయ సేవా సంస్థను ఆశ్రయించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమకు పోషణ కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జడ్జి అనిత మాట్లాడుతూ.. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే చర్యలు


