హైదరాబాద్: 28°C
తెలంగాణ

బందారం మల్లన్న ఆలయంలో చోరీ

SDPT: కొండపాక మండలం బందారం మల్లన్న ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఉదయం పూజలకు వెళ్లిన భక్తులు తలుపులు తెరిచి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ రవీందర్ రెడ్డి పరిశీలించగా, క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ఈ ఘటనలో సుమారు రూ. 60 వేల విలువైన ఆభరణాలు అపహరణకు గురైనట్లు అధికారులు తెలిపారు.