హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి సేకరణ: లక్ష్మీ కిరణ్

సిద్దిపేట జిల్లాలో దసరా పండగ నుంచే పత్తి కొనుగోళ్లు మొదలుపెట్టాలని అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ అధికారులకు స్పష్టం చేశారు. మార్కెట్ కమిటీల పరిధిలోని 23 సీసీఐ కేంద్రాల్లో పూర్తిస్థాయి ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కేంద్రాలకు వచ్చే రైతులకు రవాణా, తాగునీరు వంటి సదుపాయాల్లో లోపాలు లేకుండా చూసి కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదేశించారు.