హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా అధికారుల సాధికారతే లక్ష్యం: సీపీ

సిద్దిపేట సీపీ కార్యాలయంలో మహిళా అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. పని ప్రదేశాల్లో మహిళలకు పరిపూర్ణ భద్రత, గౌరవం కల్పిస్తూ వేధింపులు లేని వాతావరణం అందిస్తామని అధికారులు వెల్లడించారు. యూనిఫాం ధరించిన మహిళా పోలీసుల సాధికారతకు నిబద్ధతతో పనిచేస్తున్నామని, వారి హక్కుల పరిరక్షణతో పాటు, సముచిత స్థానం కల్పించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు.