AP: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఇవాళ 11 జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి వానలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
వార్తలు
రాష్టంలో మూడు రోజులు వర్షాలు


