హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రధాన రహదారిపై కొండచిలువ కలకలం

KMR: బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ డబుల్ బెడ్రూం కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై కొండచిలువ కదులుతుండటాన్ని గమనించిన వాహనదారులు, ప్రజలు అప్రమత్తమయ్యారు. కొంతసేపు రాకపోకలకు దూరంగా ఉండగా, కొండచిలువను చూసేందుకు పలువురు అక్కడికి చేరుకున్నారు.